ఎర్రచందనం పట్టివేత
బాలాయపల్లి(సైదాపురం) : మండలంలోని అలిమిలి వద్ద ముళ్లపొదల్లో దాచి ఉంచిన 10 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫారెస్ట్ సిబ్బంది భవానీ, అశోక్, గిరి పాల్గొన్నారు.
రైలు కింద పడి వ్యక్తి మృతి
తిరుపతి క్రైమ్ : తిరుపతి రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి (45) రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు.. కొల్హాపూర్ వెళ్లే హరిప్రియ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఐదో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై నుంచి జారి రైలు కింద పడిపోయాడు. దీంతో అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదవశాత్తు ట్రైన్ కింద పడ్డాడు. మృతుడి వివరాలు తెలియలేదని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించామని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు సమాచారం తెలిసిన వారు 9440627638 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
కనుమలో లారీ బోల్తా
చంద్రగిరి : తిరుపతి–పీలేరు జాతీయ రహదారిపై భాకరాపేట కనుమ వద్ద శనివారం వేకువజామున ఓ లారీ బోల్తా పడింది. వివరాలు.. పీలేరు నుంచి టమాట లోడ్‌తో వస్తున్న లారీ కనుమలోని పెద్ద మలుపు వద్ద అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. అయితే లారీ డ్రైవరు, క్లీనర్‌లు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, వెనుక వచ్చే వాహనాలను దారి మళ్లించారు. అనంతరంయంత్రాల సాయంతో లారీను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించి, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తమిళనాడు బస్సులో వ్యక్తి మృతి
నాయుడుపేటటౌన్ : చైన్నె నుంచి నెల్లూరు వెళుతున్న తమిళనాడు బస్సులో ఎల్లసిరి శ్రీనివాసులు(42) అనే వ్యక్తి గుండెపోటుతో శనివారం సాయంత్రం మృతి చెందారు.వివరాలు.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంతానికి చెంది శ్రీనివాసులు సూళ్లూరుపేటలో తమిళనాడు బస్సు ఎక్కి గూడూరుకు టికెట్ తీసుకున్నారు. పండ్లూరు సమీపంలో వచ్చేసరికి శ్రీనివాసులు అచేతనంగా పడిపోయారు. కండక్టర్ ధనంజయులు సమాచారం మేరకు 108 సిబ్బంది చేరుకుని శ్రీనివాసులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ప్రయాణికులను తమిళనాడు చెందిన మరో బస్సులో నెల్లూరుకు చేర్చారు. శ్రీనివాసులు మృతదేహాన్ని పోలీసులు గూడూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎర్రచందనం పట్టివేత
ఎర్రచందనం పట్టివేత


