తిరుపతి బాలోత్సవం తేదీ మార్పు
తిరుపతి కల్చరల్: నగరంలో ఈ నెల 25, 26వ తేదీల్లో జరగాల్సిన తిరుపతి బాలోత్సవం 4వ పిల్లల పండుగను భారీ వర్షాల కారణంగా నవంబర్ 1, 2 తేదీలకు మార్పు చేసినట్లు తిరుపతి బా లోత్సవం అధ్యక్ష, కార్యదర్శులు మల్లారపు నాగార్జున, నడ్డి నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. బాలోత్సవ ఏర్పాట్లన్నీ పూర్తయినా 160 పాఠశా లల నుంచి 10 వేల మందికిపైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడానికి పేర్లు నమోదు చేసుకున్నారని, ఎడతెరపిలేని వర్షాల కారణంగా పిల్లలు హాజరు కాలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో తిరుపతి బాలోత్సవం కమిటీ సదరు తేదీల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఎర్రచందనం కేసులో
ఇద్దరికి ఐదేళ్లు జైలు
తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ఇద్దరికి ఐదేళ్లు జైలు శిక్ష, ఒక్కొ క్కరికి రూ.3 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి గురువారం తీర్పు చెప్పారు. కో ర్టు లైజనింగ్ ఆఫీసర్లు బాబు ప్రసాద్, ఏ.ఖ్యాతి, కోర్ట్ కానిస్టేబుల్ చంద్రకళ కథనం మేరకు.. 2018 డిసెంబర్ 6వ తేదీ పీలేరు రేంజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, సిబ్బంది పీలేరు రోడ్డులోని యల్లమంద క్రాస్ సమీపంలో వాహనాలను తనిఖీ చే శారు. ఆ సమయంలో ఓ టాటా సఫారీ వాహనం అతివేగంగా వచ్చింది. ఫారెస్ట్ సిబ్బంది ఆ వాహనాన్ని ఆపిన ఆగలేదు. దీంతో ఫారెస్ట్ సిబ్బంది ఆ వాహనాన్ని వెంబడించి వాహనాన్ని ఆపారు. వాహనంలోని తమిళనాడు, వేలూరు జిల్లా, వానం బాడీ తాలూకా, బాలప్పనూరు గ్రామానికి చెందిన కె విజయ్కుమార్, తిరువణామలై జిల్లా, సింగం తాలూకా, కుత్తు టూరు గ్రామానికి చెందిన వి రామరాజును అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ విచారించగా పీలేరు రేంజ్, రొంపిచర్ల సెక్షన్, మేళ్లచెరువు బీట్ అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికి కర్ణాటకకు తరలిస్తున్నట్టు ఫారెస్టు సిబ్బందికి తెలిపారు. వాహనంలో 71 కిలోల ఆరు ఎర్రచందనం దుంగలను ఫారెస్ట్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ అమరనారాయణ వాదించారు.


