మైనర్‌పై ఫోక్సో కేసు నమోదు
సత్యవేడు: సొంత బంధువు కుమారుడు తన కూ తురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితు రాలి తల్లి సత్యవేడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మైనర్ బాలుడిపై ఫోక్సో కేసు నమో దు అయ్యింది. పోలీసుల కథనం మేరకు.. దాసుకుప్పం పంచాయతీలో తాపీ మేస్త్రి దంపతులు జీవిస్తున్నారు. వారికి రెండో తరగతి చదువుతు న్న కుమార్తె(7), యూకేజీ చదువుతున్న కుమా రుడు ఉన్నారు. తాపీ మేసీ్త్ర బావమర్ధి కుమారుడు మైనర్ బాలుడు తాపీమేస్త్రి ఇంట్లోనే ఉంటున్నా డు. ఊత్తుకోటలో పనిచేస్తున్న తాపీమేస్త్రి తన పిల్లలను బడి నుంచి ఇంటికి తీసుకురావాలని బావమర్ధి కుమారుడికి ఫోన్‌లో చెప్పాడు. పిల్లల్ని తీసుకువచ్చిన ఆ బాలుడు, బాలికపై అఘాయి త్యం చేశాడు. ఈ విషయం ఆ బాలిక తన తల్లికి చెప్పింది. తల్లి సత్యవేడు పోలీస్ స్టేషన్‌లో రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేయడంతో పుత్తూరు డీఎస్పీ రవికుమార్, శ్రీసిటీ డీఎస్సీ శ్రీనివాసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
కెమికల్ ట్యాంకర్ బోల్తా
రేణిగుంట:మండలంలోని గాజులమండ్యం సమీపంలోని తిరుపతి–చైన్నె రహదారిలో గురువారం తెల్లవారుజామున కెమికల్ ట్యాంకర్ బోల్తా పడింది. గుజరాత్ నుంచి తమిళనాడులోని శ్రీ పెరంబూరుకు వెళుతున్న ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడింది. ట్యాంకర్ నుంచి కెమికల్ లీకేజ్ కావడంతో గాజుల మండ్యం గ్రామస్తులు భయాందోళన చెందారు. పెయింట్‌లో వాడే కెమికల్ పదార్థంగా పోలీసులు గుర్తించారు. రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, రూరల్ సీఐ మంజునాథరెడ్డి, ఎస్‌ఐ సుధాకర్ సంఘటన స్థలానికి చేరుకుని నివారణ చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్లతో ట్యాంకర్‌పై నీటిని చల్లుతూ క్రైన్ల సహాయంతో ట్యాంకర్‌ను పైకి తీయించారు. స్థానిక కంపెనీల సాంకేతిక నిపుణులు వచ్చి ప్రమాదకర కెమికల్ కాదని నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


