అమరుల సేవలు చిరస్మరణీయం
– 8లో
అమరవీరుల సేవలు చిరస్మరణీయమని, వారి సేవలను ప్రతి పౌరుడు స్మరించుకోవాలని కలెక్టర్ వేంకటేశ్వర్ అన్నారు.
ఔషధ మొక్కలపై పీజీ కోర్సులు
తిరుపతి సిటీ: ఎస్వీయూ ఔషధ మొక్కల పెంపు, హెర్బల్ చికిత్సలపై ఉపాధి కోర్సులను ప్రవేశపెట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా రు. ఈ మేరకు వచ్చే విద్యా సంవత్సరంలోపు రెండేళ్ల పీజీ కోర్సు, ఏడాది పీజీ డిప్లొమో కోర్సుల ప్రా రంభం దిశగా కసరత్తు మొదలైంది. ఈ మేరకు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఔషధ మొక్కలు, సు గంధ ద్రవ్యాల బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికా రి ఆవుల చంద్రశేఖర్ యూనివర్సిటీని సందర్శించారు. నూతన వీసీ ప్రొఫెసర్ తాతా నరసింహరావుతోపాటు అధికారులను కలిసి సమీక్ష సమా వేశం నిర్వహించనున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే కోర్సుల ప్రారంభానికి వర్సిటీ అధికారులు చొరవ చూపాలన్నారు. ఎస్వీ యూ ప్రాంగణంలో ఔషధ మొక్కల నర్సరీని పెంచడానికి రూ.6.50 లక్షల నిధులను విడుదల చేసినట్లు బోర్డు సీఈఓ చంద్రశేఖర్ ప్రకటించారు. హెర్బల్ గార్డెన్ ఏర్పాటుకు తగిన ప్రతిపాదనలను పంపితే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చా రు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ భూపతినాయుడు, బోటనీ విభాగం ప్రొఫెసర్లు ప్రొఫెసర్ టీ విజయ, ప్రొఫెసర్ కామాక్షి, అధికారులు పాల్గొన్నారు.
స్కిట్, జేఎన్టీయూలో
విలీనం జీఓ విడుదల
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధంగా ఉన్న స్కిట్ కళాశాలను జేఎన్‌టీయూలో విలీనం చేస్తూ మంగళవారం జీఓ విడుదలైంది. అయితే ఆలయానికి సంబంధించిన స్కిట్ కళాశాల భూములు, భవనాలను 33 ఏళ్ల పాటు లీజుకి ఇస్తున్నట్లు జీఓలో పేర్కొన్నారు. ఎకరాకు రూ.వెయ్యి, భవనాలకు రూ.50 వేల చొప్పున అద్దె చెల్లించేలా జీఓలో ఉంది. బోధన, బోధనేతర సిబ్బంది సంబంధించిన నియామకాలకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అయితే కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి డైలామాలో పడింది.


