శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 72,026 మంది స్వామివారిని దర్శించుకోగా 23,304 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.86 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుమల తిరుపతిలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వెంటనే ఆలయం వెలపులకు వచ్చిన భక్తులు పరుగులు తీస్తూ చలువపందిళ్ల వద్దకు చేరుకుంటున్నారు. తిరుమల దుకాణాల్లో కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి.
తిరుమలలో నిర్మానుష్యంగా ఆలయ ప్రాంగణం


