చిన్నారి అప్పగింత
తిరుపతి క్రైమ్ : తల్లిదండ్రుల నుంచి దూరమైన చిన్నారిని మహిళా పోలీసులు తిరిగి అప్పగించిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. శనివారం రాత్రి 7 గంటల సమయంలో గోవిందరాజస్వామి ఆలయం వద్ద సుమారు 6 నెలల పాప ఏడుస్తూ కనిపించింది. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో రాత్రి అంతా ఓ మహిళ తన ఇంటికి తీసుకెళ్లి పాపను జాగ్రత్తగా చూసుకుంది. ఆదివారం ఉదయం మహిళా పోలీసుల వద్దకు చేర్చింది. ఈ క్రమంలో చిన్నారి అదృశ్యంపై ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు అందిందని తెలియడంతో వెంటనే అక్కడకు వెళ్లి తల్లిదండ్రుల వివరాలను సేకరించి పాపను అప్పగించారు. పోలీసులకు పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.


