మిథున్‌రెడ్డి అరెస్ట్‌ అప్రజాస్వామికం | - | Sakshi
Sakshi News home page

మిథున్‌రెడ్డి అరెస్ట్‌ అప్రజాస్వామికం

Jul 20 2025 5:28 AM | Updated on Jul 20 2025 2:21 PM

మిథున

మిథున్‌రెడ్డి అరెస్ట్‌ అప్రజాస్వామికం

● ఎంపీ అరెస్ట్‌పై పెల్లుబికిన నిరసన ● మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్‌ చేయడం దుర్మార్గం ● కూటమి ప్రభుత్వం జనాగ్రహానికి గురికాక తప్పదు

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌పై చిత్తూరు, తిరుపతి జిల్లాల ప్రజలు మండిపడుతున్నారు. లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఆయన్ను శనివారం రాత్రి సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేయడంపై ధ్వజమెత్తుతున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబాన్ని అణగదొక్కడానికే మిథున్‌రెడ్డిని విరికించారని విరుచుకుపడుతున్నారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని చూసి కూటమి ప్రభుత్వం వణికి పోతోందని తెలిపారు. అందుకనే అక్రమ కేసులు బనాయించి, లిక్కర్‌ స్కామ్‌ కేసులో విరికించి భయపెట్టాలని చూస్తోందని ఆరోపించారు. ఎన్ని కుట్రలు పన్నినా న్యాయం గెలిచి తీరుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని స్పష్టం చేశారు.

– పుంగనూరు / పలమనేరు/ కాణిపాకం

ఎంపీ అరెస్ట్‌ కక్ష పూరితం

ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరింస్తోంది. రాష్ట్ర ప్రజలను భయపెట్టాలని చూస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో దాడులు ఎక్కువయ్యాయి. అరాచకాలకు పాల్పడుతోంది. అవినీతి, అక్రమాలు తారస్థాయికి చేరుకున్నాయి. వీటిని ప్రశ్నించే గొంతు నొక్కేస్తోంది. అడ్డొచ్చే ప్రతిఒక్కర్నీ అణగదొక్కుతోంది. కుట్ర పూరితంగా తప్పుడు కేసులు బనాయిస్తోంది. ఇప్పటికే వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు నేతలను అరెస్ట్‌ చేయగా..రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని కూడా అరెస్ట్‌ చేసింది. ఇది ముమ్మాటికీ దారుణం. పగ బట్టి ప్రతీకారం తీర్చుకుంది. ఈ ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వైఎస్సార్‌సీపీని, మిథున్‌రెడ్డి ఏం చేయలేరు. మిథున్‌రెడ్డి అరెస్ట్‌ను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.

– సునీల్‌కుమార్‌,

మాజీ ఎమ్మెల్యే, పూతలపట్టు

అక్కసుతోనే అక్రమ అరెస్ట్‌

ఎంపీ మిథున్‌రెడ్డిపై అక్కసుతోనే లిక్కర్‌ కేసు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే తీవ్ర ప్రజావ్యతిరేకత ఏర్పడింది. అదే సమయంలో వైఎస్సార్‌ సీపీకి విశేష ఆదరణ లభిస్తోంది. దీన్ని చూసి కూటమి నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో లిక్కర్‌ కేసులో ఇరికించారు. ఏడు కేసుల్లో బెయిల్‌పై ఉన్న చంద్రబాబు వరుసబెట్టి వైఎస్సార్‌ సీపీ నాయకులపై కేసులు పెట్టిస్తున్నారు. ఇలాంటి తప్పుడు కేసులకు వైఎస్సార్‌ సీపీ నాయకులు భయపడే ప్రసక్తేలేదు. – పవిత్ర, వైఎస్సార్‌సీపీ విశ్వబ్రాహ్మణ విభాగం అధ్యక్షురాలు,

బైరెడ్డిపల్లి క్రిష్ణమూర్తి, మురళీకృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు

మిథున్‌రెడ్డి అరెస్ట్‌ అప్రజాస్వామికం1
1/2

మిథున్‌రెడ్డి అరెస్ట్‌ అప్రజాస్వామికం

మిథున్‌రెడ్డి అరెస్ట్‌ అప్రజాస్వామికం2
2/2

మిథున్‌రెడ్డి అరెస్ట్‌ అప్రజాస్వామికం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement