మత్తుకు యువత బానిస కావొద్దు
తిరుపతి సిటీ : మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, వాటిని దరిచేరనిస్తే బంగారు భవిష్యత్తుకు ముగింపు పలికినట్టేనని ఎస్పీడబ్ల్యూ ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణమ్మ పేర్కొన్నారు. పద్మావతి మహిళా డిగ్రీ , పీజీ కళాశాలలో మాదకద్రవ్య నివారణ, ర్యాగింగ్ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ మాదక ద్రవ్య నివారణ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. యువత ఉన్నత లక్ష్యం వైపు పయనించాలే తప్ప, జీవితాన్ని నాశనం చేసే డ్రగ్స్, మత్తుకు బానిస కావొద్దన్నారు. మహిళా అధ్యయన కేంద్రం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ హేమావతి శ్రీడ్రగ్ అబ్యూస్ఙ్ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా యువత తమ జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారో వివరించారు. అనంతరం కమిటీ కన్వీనర్ డాక్టర్ వసుధ విద్యార్థినులతో మాదకద్రవ్యాల జోలికి వెళ్లమని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు డాక్టర్ జయశ్రీ, డాక్టర్ లక్ష్మి సంధ్య, డాక్టర్ వరప్రసూన, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ భద్రమణి, ఐఐసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఉమారాణి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు


