జేఈఈ టాపర్లకు కలెక్టర్‌ అభినందన | - | Sakshi
Sakshi News home page

జేఈఈ టాపర్లకు కలెక్టర్‌ అభినందన

Jun 27 2025 4:06 AM | Updated on Jun 27 2025 4:06 AM

జేఈఈ టాపర్లకు  కలెక్టర్‌ అభినందన

జేఈఈ టాపర్లకు కలెక్టర్‌ అభినందన

తిరుపతి ఎడ్యుకేషన్‌ : ఇటీవల ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌, నీట్‌ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన నారాయణ విద్యాసంస్థల విద్యార్థులను కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ అభినందించారు. గురువారం కలెక్టరేట్‌ కార్యాలయంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ టాపర్లు భానుచరణ్‌రెడ్డి, మణిదీప్‌రెడ్డి, హిమేష్‌ రాఘవ, శశాంక్‌రెడ్డి, యశ్విత, నిఖిల్‌, నీట్‌ టాపర్లు జ్ఞానీష, మౌనిక, కీర్తి, విశ్వక్‌ అగర్వాల్‌ను కలెక్టర్‌ అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశాభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఆ విద్యాసంస్థ డీజీఎం కొండలరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.

పది ఎర్రచందనం దుంగలు స్వాధీనం

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌: అక్రమంగా తరలిస్తున్న 10 ఎర్రచందనం దుంగలు బుధవారం రాత్రి రేణిగుంట – మామండూరు మార్గంలోని ఆంజనేయపురం వద్ద స్వాధీనం చేసుకున్నట్లు అటవీ క్షేత్రాధికారి బి.సుదర్శనరెడ్డి తెలిపారు. పట్రోలింగ్‌ చేస్తుండగా అతి వేగంగా వస్తున్న కారును ఆపామని తెలిపారు. డ్రైవర్‌ వేగంగా దూసుకెళ్లాడని, దాన్ని వెంబడించడంతో డ్రైవర్‌ వాహనాన్ని వదిలి పారిపోయాడన్నారు. కారులో 294 కిలోల బరువు కలిగిన దుంగలను గుర్తించామన్నారు. వాటి విలువ సుమారు రూ.6.5 లక్షలుగా అంచనా వేశామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎఫ్‌ఎస్‌వో చైతన్య, కరకంబాడి ఎఫ్‌బివో వెంకటేశ్వరరావు, ప్రొటెక్షన్‌ వాచర్లు సిసింద్రి, వెంకటేష్‌, ప్రసాద్‌, నవీన్‌, రవి పాల్గొన్నారు.

నేడు ఆర్‌ఏఆర్‌ఎస్‌లో జాతీయ సదస్సు

తిరుపతి సిటీ : స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు ‘వ్యవసాయంలో సవాళ్లు, వాతావరణ అనుకూలత నూతన ఆవిష్కరణలు’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. సదస్సుకు దేశంలోని పలు వర్సిటీల నుంచి అధికారులు, ప్రధాన శాస్త్రవేత్తలు హాజరు కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement