
దుకాణంలోకి దూసుకెళ్లిన టిప్పర్
– రూ.5 లక్షల ఆస్తి నష్టం
రేణిగుంట : కడప–రేణిగుంట రహదారిలోని కరకంబాడి సమీపంలో రోడ్డు పక్కన ఇరానీ కేఫ్‌లోకి సోమవారం మధ్యాహ్నం ఇసుక లోడ్‌తో వెళుతున్న టిప్పర్ దూసుకెళ్లింది. ఆ సమయంలో కేఫ్‌లో జనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం మేరకు.. రాజంపేట నుంచి తిరుపతి పరిసర ప్రాంతానికి ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ అదుపుతప్పి కట్ట పుట్టలమ్మ దేవాలయం ఎదురుగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఇరానీ కేఫ్‌లోకి దూసుకెళ్లింది. దీంతో సుమారు రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న టిప్పర్ డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.