రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి
నాయుడుపేటటౌన్ : ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి గుర్తు తెలియని వ్యక్తి నాయుడుపేట రైల్వే స్టేషన్ వద్ద మృతి చెందిన ఘటన శనివారం సూళ్లూరుపేటలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మాల కొండయ్య తెలిపిన మేరకు వివరాలు ఇలా.. చైన్నె ఈ రోడ్ నుంచి జబల్‌పూర్‌నకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలి యని వ్యక్తి జారి పడి మృతి చెందినట్లుగా స్టేషన్ సూపరిండెంట్ లక్ష్మీనారాయణ గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి చేతిపై ఇంగ్లీష్‌లో జ్యోతి పేరుతో టాటు వేసుకుని ఉన్నట్లు వెల్లడించారు. మృతదేహాన్ని స్ధానిక ప్రభుత్వ వైద్యశాల మార్చురీలో భద్రపరిచి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ తెలిపారు.


