
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా గిరిధర్‌రెడ్డి
సూళ్లూరుపేట : నాయుడుపేటకు చెందిన ఓడూరు గిరిధర్‌రెడ్డిని పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ మంగళవారం కేంద్ర పార్టీ కార్యాలయం ఉత్తర్వులు విడుదల చేసింది. ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉంటూ ఆయన పలు పదవుల్లో కొనసాగారు. శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో తన సేవలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరినీ కలుపుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.
చెరువులో అంత్యక్రియలు చేయొద్దని నిరసన
బాలాయపల్లి (సైదాపురం) : మండలంలోని నిండలి గ్రామానికి చెందిన వల్లెపు కోటమ్మ (110) మంగళవారం మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని సమీపంలోనే కొత్త చెరువు వద్ద అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నించగా స్థానిక దళితవాడ ప్రజలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ ఇళ్ల ముందే దహన సంస్కారాలు ఎలా చేస్తారంటూ దళితులు ఆందోళన వ్యక్తం చేశారు. పూర్వీకుల నుంచి ఇక్కడే ఖననం చేస్తున్నామని మరో వర్గం వాదనలకు దిగారు. ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో తహసీల్దార్ విజయలక్ష్మి , పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాల వాదనలు విన్నారు. చెరువు ప్రభుత్వ స్థలం ఇక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించడంతో మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించారు. దీంతో వివాదం సమసిపోయింది.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా గిరిధర్‌రెడ్డి