
అర్హులకు అవకాశం లేదు
నిజమైన పేదలకు అర్హులైన వారికి అవకాశం ఇవ్వలేదు. కుట్టుమిషన్ల ఇవ్వడం ద్వారా వారి కుటుంబ పోషణకు ఉపయోగపడుతుందని ఈ స్కీమ్ ఏర్పాటు చేశారు. అయితే కూటమి నేతలు ఎవరి పేరు సిఫార్సు చేస్తే వారి పేర్లు మాత్రమే నమోదు చేసుకున్నారు. మరోవైపు కుట్టుమిషన్లలోను అవినీతికి పాల్పడ్డారంటేనే తెలుస్తోంది కూటమి నేతల చిత్తశుద్ధి. – విజయలక్ష్మి, తిరుపతి
ఫిర్యాదు చేశాం
రాష్ట్ర వ్యాప్తంగా కుట్టుమిషన్ల విషయంలో అవినీతి జరిగింది. 60శాతం నిధులు కొట్టేస్తున్నారు. దీనిపై డీఆర్‌ఓ నరసింహులుకు ఫిర్యాదు చేశాం. బీసీ మహిళలకు న్యాయం చేయాలని కోరుతున్నాం. కూటమి నేతలకు చిత్తశుద్ధి ఉంటే బహిరంగంగానే ఈ అంశంపై సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
– పుల్లయ్య బీసీ సంఘం రాష్ట్ర నేత
త్వరలోనే అన్ని సెంటర్లు
కుట్టు శిక్షణకు సంబంధించి జిల్లావ్యాప్తంగా త్వరలోనే అన్ని సెంటర్లను అందుబాటులోకి తీసుకువస్తాం. 144 సెంటర్లకు ప్రస్తుతం 25 సెంటర్లలో శిక్షణ ఇస్తున్నాం. అర్హులైన వారినే ఎంపిక చేశాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాం. లోటుపాట్లు ఉంటే వాటిని సవరించుకుని అందరికీ న్యాయం చేస్తాం.
– శ్రీదేవి, ఈడీ, బీసీ కార్పొరేషన్

అర్హులకు అవకాశం లేదు

అర్హులకు అవకాశం లేదు