
జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ
తిరుపతి అర్బన్: వెంకటగిరిలో ఈ నెల 15న నిర్వహిస్తున్న జాబ్‌మేళా పోస్టర్‌ను కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, డీఆర్‌ఓ నరసింహులు సోమవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. మేళాకు పలు కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారని అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. 5వ తరగతి నుంచి పీజీ వరకు అర్హులన్నారు. అదనపు సమాచారం కోసం 7013509543, 9491458910, 9988853335 నంబర్లను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి లోకనాథం, జిల్లా సచివాలయాల అధికారి జగదీష్ పాల్గొన్నారు.