
టీటీడీలో డెప్యూటీ ఈఓల బదిలీ
తిరుమల: టీటీడీ డెప్యూటీ ఈఓలను బదిలీ చేస్తూ సంబంధిత ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. తిరుమల రిసెప్షన్–2 డిప్యూటీ ఈఓ హరేందర్‌నాథ్‌ను తిరుచానూరుకు బదిలీ చేయగా.. అక్కడ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న గోవిందరాజను పూర్తి స్థాయిలో హెచ్‌ఆర్ డిప్యూటీ ఈఓగా కొనసాగనున్నారు. తిరుమల రిసెప్షన్ డిప్యూటీ ఈవో–1 గా ఉన్న భాస్కర్‌కు రిసెప్షన్ టూ డిప్యూటీ ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం నుంచి తిరుమల ఎస్టేట్ అధికారిగా పనిచేస్తున్న మల్లికార్జునరావును తిరిగి మాతృ సంస్థకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
సీనియారిటీ జాబితాను పరిశీలించుకోండి
చిత్తూరు కలెక్టరేట్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీచర్లు ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితాలను పరిశీలించుకోవాలని డీఈఓ వరలక్ష్మి తెలిపా రు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎస్జీటీ క్యాడర్ నుంచి స్కూల్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ నుంచి గ్రేడ్– 2 హెచ్‌ఎం ఉద్యో గోన్నతులు త్వరలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రెండు విడతలుగా సీనియారిటీ జాబితాలు విడుదల చేశామన్నారు. టీచర్ల నుంచి అందిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ప్రస్తుతం మరో సారి సీనియారిటీ జాబితాను విడుదల చేశామన్నారు. ఈ జాబితాలను www.chittoordeo.com వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవాలని డీఈఓ తెలిపారు.