
విమానాశ్రయంలో మాక్ డ్రిల్
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): ఇండో–పాక్ యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని శనివారం రేణిగుంటలోని తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారి మాక్ డ్రిల్‌ను పర్యవేక్షించారు. విమానశ్రయంలోకి మారణాయుధాలతో అక్రమంగా ప్రవేశిస్తే అనుసరించాల్సిన వ్యూహాలను చేసి చూపించారు. ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ భూమినాథన్, సీఐఎస్‌ఎఫ్ కమాండో బహుదూర్, సీఎస్‌ఓ.రాజేంద్రప్రసాద్, రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసులు, గాజులమండ్యం సీఐ మంజునాథ రెడ్డి, విమానాశ్రయం సీఎస్‌ఓ, ఇంటెలిజెన్స్ బ్యూరో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.