భారతమ్మపై అనుచిత వ్యాఖ్యలు
● పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు ● చేబ్రోలు కిరణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
బుచ్చినాయుడుకండ్రిగ: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలపై బుచ్చినాయుడుకండ్రిగ పోలీస్ స్టేషన్‌లో గురువారం వైఎస్సార్‌సీపీ మండల కన్వీనరు కొణతనేని మణినాయుడు, చిత్తూరు జిల్లా సోషల్ మీడియా కన్వీనరు వేలూరు రాకేష్ ఫిర్యాదు చేశారు. యూట్యూబర్ చేబ్రోలు కిరణ్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతిరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై టీడీపీ ఆధ్వర్యంలో పనిచేసే ఐటీడీపీ వంటి సంస్థలు అభ్యంతరకరమైన పోస్టింగ్‌లు పెట్టాయని ఆరోపించారు. కొన్నింటిని మార్ఫింగ్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారం చేయడం వారి గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగుతోందన్నారు. పాయింట్ బ్లాక్ అనే యూట్యూబ్‌లో చేబ్రోలు కిరణ్ అభ్యంతకరమైన ఆరోపణలు చేశారని, కిరణ్‌తోపాటు ఇంటర్వ్యూ చేసిన వారిపై కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వారి వెంట వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు గోపాల్‌రెడ్డి, రవిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గురునాథం, వైస్ ఎంపీపీ మునికృష్ణారెడ్డి, నాయకులు గురవయ్య, ప్రసాద్‌పాల్, కిరణ్‌యాదవ్, ప్రసాద్, అమరలింగయ్య, వెంకటేష్, రాజశేఖర్, దయాకర్‌రెడ్డి ఉన్నారు.


