నేటి నుంచి పోషణ్ పఖ్వాడా
తిరుపతి అర్బన్: మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 7వ పోషణ్ పఖ్వాడా కార్యక్రమాన్ని మంగళవారం నుంచి ఈ నెల 22 వరకు నిర్వహించాలని డీఆర్వో నరసింహులు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఐసీడీఎస్, ఆర్‌డబ్ల్యూఎస్, వైద్య శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పోషణ్ అభియాన్‌లో భాగమైన పోషక విలువలు, ఆరోగ్యకరమైన ఆహార స్వీకరణ అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఐసీడీఎస్ పీడీ వసంతబాయి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
64 మందిలో 48 మందికే పింఛన్
సత్యవేడు: మండలంలోని సత్యవేడు పంచాయతీ వీఆర్‌ఓ 64 మందికికి గాను 48 మందికే పింఛన్లు పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సత్యవేడు 1వ సచివాలయ పరిధిలోని వీఆర్‌ఓగా పనిచేస్తున్న చిట్టిబాబుకు ఏప్రిల్ పింఛన్‌ను 64 మందికి అందజేసేందుకు రూ.2.68 లక్షలు తీసుకున్నారు. ఏప్రిల్ 1న 48 మందికి పింఛన్ రూ.2.2 లక్షలు పంపిణీ చేశారు. ఆ తర్వాత బంధువులకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి వెళ్లాడు. వారం రోజులైనా ఆయన జాడ లేదు. దీంతో సత్యవేడు సెక్రటరీ మునిరవికుమార్ ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వస్తోంది. దీంతో లబ్ధిదారులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.


