చికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని మృతి | Young medical student ends life in Nalgonda | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని మృతి

Jul 8 2026 12:33 PM | Updated on Jul 8 2026 12:35 PM

Young medical student ends life in Nalgonda

నల్లగొండ : సర్జరీ తర్వాత దాదాపు మూడు రోజుల పాటు ఆస్పత్రిలోని వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ యువ వైద్య విద్యార్థిని మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కోదాడకు చెందిన ధరావత్‌ అమృత(23) జిల్లాకేంద్రంలోని ఎస్‌వీఎస్‌ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి హౌజ్‌సర్జన్‌(ఇంటన్‌షిప్‌)గా పనిచేస్తోంది. 

అయితే కొన్ని రోజులుగా ఆమె థైరాయిడ్‌ సమస్యతో ఇబ్బంది పడుతోంది. దీంతో ఆమెను ఈనెల 4న ఎస్‌వీఎస్‌ ఆస్పత్రిలో థైరాయిడ్‌కు సంబంధించిన సర్జరీ పూర్తి చేశారు. సర్జరీ అయిన తర్వాత మూడు రోజుల పాటు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న విద్యార్థిని మంగళవారం మధ్యాహ్నం మృతి చెందింది. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని రూరల్‌ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement