 
													
ఆహారాన్ని సేకరించుకోలేక పోతున్న ముసలి పక్షికి, బుజ్జి పక్షులు ఆహారాన్ని తెచ్చి పెట్టడం చూశారా. ఆకలితో ఉన్న పెద్ద పక్షులకు చక్కగా ఆహారాన్ని నోటికి అందిస్తున్న వీడియో విశేషంగా నిలుస్తోంది.
సాక్షి, హైదరాబాద్: మనిషి గమనించాలేగానీ అనంతమైన అద్భుతాలు, విశేషాలకు నిలయం ప్రకృతి. నేర్చుకోవాలేగానీ, ప్రతీ జీవన సూత్రం, ధర్మం ప్రకృతిలో ఇమిడి ఉంది. సాధారణంగా నిస్సహాయులకు, జవసత్త్వాలుడిగిన పెద్దలకు, తల్లీదండ్రులకు ..వారి వారసులు, పిల్లలు సేవలు చేయడం సహజం. అది మానవధర్మం కూడా. నేటి ఆధునిక సమాజంలో ఎంతమంది ఈ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
కానీ ఆహారాన్ని సేకరించుకోలేకపోతున్న ముసలి పక్షికి, బుజ్జి పక్షులు ఆహారాన్ని తెచ్చి పెట్టడం చూశారా. ఆకలితో ఉన్న పెద్ద పక్షులకు చక్కగా ఆహారాన్ని నోటికి అందిస్తున్న వీడియో విశేషంగా నిలుస్తోంది. అద్భుతం అంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను హరి చందన (ఐఏఎస్) ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రకృతి ధర్మాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తున్న యంగ్ బర్డ్స్ ని మీరు కూడా చూసేయండి!
Young #birds feeding older 🐦 who are unable to search for #food. #lessons from #nature. pic.twitter.com/cmbzSKTen5
— Hari Chandana IAS (@harichandanaias) May 19, 2022

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
