మొదటి కాన్పులోనే కవలలు.. అంతలోనే తల్లిదండ్రుల ఆనందం ఆవిరి

Warangal: Parents Need Help To Their Twin Sons Over Organ Growth Defect - Sakshi

శరీర ఎదుగుదల లోపంతో ఆస్పత్రిలోనే

చికిత్సకు రూ.10లక్షలు కావాలంటున్న వైద్యులు

దాతలు ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు

సాక్షి, హన్మకొండ: మొదటి కాన్సు.. కవలలు జన్మించారు.. ఈ విషయం సంతోషాన్ని కల్గించినా.. పుట్టిన బిడ్డలిద్దరికీ అవయవాలు పెరగడంలేదనే విషయం తెలిసి ఆ తల్లిదండ్రుల ఆనందరం ఆవిరైంది. ఆ కవలలు సాధారణ స్థితికి చేరాలంటే రూ.10లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పెద్దపల్లి జిల్లా,కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన బండ రాజు, అనూషలకు గత ఏడాది వివాహం జరిగింది. ఈక్రమంలో అనూషకు జనవరి 31న పురిటినొప్పులు వస్తుండడంతో హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అదే రోజు రాత్రి ఆపరేషన్‌ ద్వారా ప్రసవం చేశారు.

ఇద్దరు కవలలు(మగ) జన్మించడంతో ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. నెలలు నిండకముందే (ఎనిమిది నెలల మూడు రోజులకే) అనూష ప్రసవించడంతో శిశువులు ఒకరు 1.2, 1.7 కేజీల బరువు మాత్రమే ఉన్నారు. అంతేకాకుండా రోజులు గడుస్తున్నా వారిలోని ఊపిరితిత్తులు, గుండె, ఇతర ప్రధాన అవయవాల ఎదగడంలేదని గుర్తించిన వైద్యులు మెరుగైన చికిత్స అవసరమని, అందుకు రూ.10లక్షలు అవసరం అని చెప్పారు. ఇప్పటికే రోజుకు రూ.40వేల చొప్పున ఖర్చు అవుతుందని, పూర్థిస్థాయిలో వైద్యానికి అయ్యే ఖర్చు భరించే స్థోమత తమకు లేని చిన్నారుల తండ్రి రాజు కన్నీటి పర్యంతమవుతూ వివరించాడు.దాతలు ఆర్థిక సాయమందించి ఆదుకోవాలని వేడుకున్నాడు. 88977 47685, 94283 32336, 95505 99202 ఫోన్‌  నంబర్ల ద్వారా సంప్రదించి ఆదుకోవాలని కోరారు. 

దాతలు సాయం అందించాల్సిన వివరాలు: పేరు: బండ రాజు
అకౌంట్‌ నంబర్‌: 62251616556
ఐఎఫ్‌ఎస్‌సీ: ఎస్‌బీఐఎన్‌  0020388,
బ్రాంచ్‌: కాల్వశ్రీరాంపూర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top