కొట్టారు.. తిట్టారు.. అత్యాచారం జరగలేదు

Victim In Brick Kiln Molestation Case Clarifies Why She Ran Away - Sakshi

సాక్షి, పెద్దపల్లి‌: ఎల్‌ఎన్‌సీ ఇటుకబట్టీలో పనిచేస్తున్న తనపై సామూహిక అత్యాచారం జరిగిందన్న ప్రచారం వట్టిదేనని, ఇటుకబట్టీ యజమాని రామిండ్ల భాస్కర్, గుమాస్తా రమణయ్య తమను తిట్టి, కొట్టడం వల్లే పారిపోయామని బాధితురాలు తారాబతి తెలిపిందని పెద్దపల్లి సీఐ ప్రదీప్‌కుమార్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భార్యాభర్తలు పూజారి, తారామతిలను రాఘవాపూర్‌లో గుర్తించి పట్టుకున్నామని సీఐ పేర్కొన్నారు. సామూహిక అత్యాచారం జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై రామగుండం ఎస్సై శైలజ సదరు బాధితురాలిని విచారించిందని వివరించారు. కార్మికులను కొట్టిన యజమాని భాస్కర్‌రావు, గుమాస్తా రమణయ్యలపై కేసు నమోదు చేశామన్నారు. దంపతులను వైద్యపరీక్షల నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి, మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరుస్తామని తెలిపారు.

బాధితురాలి నుంచి వివరాలు సేకరిస్తున్న రామగుండం ఎస్సై శైలజ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top