ఐసెట్‌కు 90% హాజరు | TS ICET 2022: 90 Percent Student Attended To Exam | Sakshi
Sakshi News home page

ఐసెట్‌కు 90% హాజరు

Jul 29 2022 1:17 AM | Updated on Jul 29 2022 10:58 AM

TS ICET 2022: 90 Percent Student Attended To Exam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ కేయూ క్యాంపస్‌ (వరంగల్‌): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి కాకతీయ యూని వర్సిటీ రెండ్రోజుల పాటు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్‌ ఐసెట్‌)కు 90.56% హాజరైనట్లు ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కె.రాజిరెడ్డి తెలి పారు. తెలంగాణలో 10, ఆంధ్రప్రదేశ్‌లో 4 కేంద్రాల్లో 27, 28 తేదీల్లో ఐసెట్‌ జరిగింది.

మొత్తం 75,952 మంది ఐసెట్‌కు దరఖాస్తు చేసుకోగా వీరిలో 68,781 (90.56%) హాజర య్యారని, 7171 (9.44 శాతం) గైర్హాజరైనట్లు అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలి పారు. ఐసెట్‌ ప్రాథమిక కీ ఆగస్టు 4న విడు దల చేస్తారని, అభ్యంతరాలు 8వ తేదీ వరకు స్వీకరిస్తారని ఆయన వెల్లడించారు. ఫైనల్‌ కీ, ఫలితాలు ఆగస్టు 22న విడుదల చేస్తారని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement