తెలంగాణ ఎంసెట్: ‘ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉంటుంది’ | TS Eamcet Entrance Exam Will Be Held On August 4th To 10th | Sakshi
Sakshi News home page

ఆగస్టు 4 నుంచి తెలంగాణ ఎంసెట్‌: కన్వీనర్‌ గోవర్ధన్‌

Aug 2 2021 5:44 PM | Updated on Aug 2 2021 6:02 PM

TS Eamcet Entrance Exam Will Be Held On August 4th To 10th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 4 నుంచి ఎంసెట్ ప్రవేశ పరీక్షలు జరుగుతాయని తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. తెలంగాణలో 82, ఏపీలో 23 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు మొదటి షెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందని తెలిపారు. ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని పేర్నొన్నారు. రెండు గంటల ముందు నుంచే పరీక్ష కేంద్రంలో పలికి అనుమతిస్తామని చెప్పారు. 

హాల్ టికెట్‌పై లొకేషన్ కూడా ఇస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులు ఒక రోజు ముందే టెస్ట్ సెంటర్ తెలుసుకోవాలని అన్నారు. ఎంసెట్‌లో ఇంటర్ సిలబస్ వెయిటేజ్ లేదని, గతంలో వెయిటేజి ఉండేదని కానీ ఇప్పుడు లేదని తెలిపారు. కోవిడ్‌తో ఇబ్బందులు పడ్డ విద్యార్థులు నష్టపోకూడదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని, సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం ఉంటుందని విద్యార్థులు ఆరోగ్య అంశాలు ఫిల్ చేసి ఇవ్వాలని చెప్పారు. కోవిడ్ వచ్చిన విద్యార్థుల కోసం పరీక్ష రీషెడ్యూల్ చేస్తామని, లేదంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement