
కోటపల్లి(చెన్నూర్): మండలంలోని పంగిడిసోమారం గ్రామ సమీపంలో గల అటవీప్రాంతంలో శెట్‌పల్లి గ్రామానికి చెందిన పొచం అనే రైతు ఆవుని పులి చంపేసింది. సోమవారం ఆవు కనిపించడం లేదని సమీపంలోని అటవీప్రాంతంలో వెతుకుతుండగా పంగిడిసోమారం అటవీప్రాంతంలోని పెద్దవాగు సమీపంలో ఆవు మృతిచెంది ఉన్నట్లు గుర్తించి ఫారెస్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. పంచనామా నిర్వహించి పులి దాడిలో మరణించినట్లు గుర్తించారు.