‘పోలీస్‌ లెక్కలు’ మరింత పక్కాగా!

Telangana Police Launches Special Exercise To Improve Functioning of DCRB - Sakshi

డీసీఆర్‌బీల్లో సాంకేతికత వినియోగం పెంపునకు ప్రణాళికలు  

ఆ విభాగం ఇన్‌స్పెక్టర్లకు మార్చి మొదటి వారంలో ప్రత్యేక శిక్షణ  

ఉత్తమ పనితీరు కనబరిచే ఇన్‌స్పెక్టర్లకు రివార్డులు: డీజీపీ 

సాక్షి, హైదరాబాద్‌: నేరాల నియంత్రణ, నేరస్తుల కట్టడి వ్యూహాల రూపకల్పనలో నేర గణాంకాలు అత్యంత కీలకం. ప్రతి జిల్లా, పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో డీసీఆర్‌బీ (డిస్ట్రిక్ట్‌ క్రైం రికార్డ్‌ బ్యూరో)లు వారి పరిధిలోని నేరాల నమోదు, కేసుల దర్యాప్తు సమాచారం, ఇతర వివరాల గణాంకాలను సేకరించడంతోపాటు విశ్లేషిస్తుంటాయి. ఇకపై డీసీఆర్‌బీల సమాచారం మరింత ఉపయోగపడేలా, పక్కాగా గణాంకాల నమోదు, సమాచారాన్ని వీలైనంత వేగంగా విశ్లేషణకు పూర్తి స్థాయిలో సాంకేతికతను వినియోగించుకోవాలని పోలీస్‌ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

ఇందుకోసం అన్ని జిల్లాల డీసీఆర్‌బీల ఇన్‌స్పెక్టర్లకు రాష్ట్ర స్థాయిలో మార్చి మొదటి వారంలో ఒక్క రోజు శిక్షణ అందించనున్నారు. స్టేట్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో (ఎస్‌సీఆర్‌బీ) ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు.  డీసీఆర్‌బీ సమాచారం క్షేత్ర స్థాయిలో పనిచేసే ఇన్వెస్టిగేషన్‌ అధికారులతోపాటు, లా అండ్‌ ఆర్డర్‌ సిబ్బందికి ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  ఉత్తమ పనితీరు కనబరిచే డీసీఆర్‌బీల ఇన్‌స్పెక్టర్లకు రివార్డులు అందజేయనున్నట్టు డీజీపీ వెల్లడించారు.    

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top