‘కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదు’ | Supreme Court Hearing On KTR Petition Over Formula-E Car Race | Sakshi
Sakshi News home page

‘కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదు’

Jan 15 2025 7:43 AM | Updated on Jan 15 2025 3:41 PM

Supreme Court Hearing On KTR Petition Over Formula-E Car Race

ఫార్ములా-ఈ కారు రేసు కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సుప్రీం కోర్టులోనూ చుక్కెదురైంది.

సాక్షి, న్యూఢిల్లీ: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సుప్రీం కోర్టులోనూ చుక్కెదురైంది. ప్రభుత్వ వాదనలతో అంగీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఆయన  వేసిన స్పెషల్‌ లీవ్‌  పిటిషన్‌ను విచారణకు అనుమతించలేదు. దీంతో.. ఆయన తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.

ఈ కేసులో తెలంగాణ హైకోర్టులో ఆయన వేసిన క్వాష్‌ పిటిషన్‌ తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. దీంతో.. ఆయన హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ జనవరి 8వ తేదీన సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్‌పీ వేశారు. అయితే అంతకు ముందే.. కేటీఆర్‌ గనుక సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలూ వినాలని తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ తరఫున కేవియట్‌ పిటిషన్‌ వేసింది. దీంతో.. ఆ పిటిషన్‌పై ఇవాళ జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం ఇరువైపులా వాదనలు వింది. 

కేటీఆర్‌ తరుఫున లాయర్ సుందరం వాదనలు 

ఇది కక్ష సాధింపుతో ప్రభుత్వం పెట్టిన కేసు. తెలంగాణలో ప్రభుత్వం మారిన వెంటనే ఈ కేసు పెట్టారు. ఇది ప్రభుత్వ ప్రాజెక్ట్‌ అని చెప్పారు. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదు. డబ్బు తీసుకున్నవారిని, హెచ్‌ఎండీఏను నిందితులుగా చేర్చలేదు అంటూ వాదనలు వినిపించారు.

ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. 

ఈ కేసులో దర్యాప్తు జరగాలి. 24 గంటల్లో కేసు కొట్టేయాలని పిటిషన్ వేశారు. ఈ కేసు దర్యాప్తునకు గవర్నర్‌ కూడా అనుమతి ఇచ్చారు అని అన్నారు.

ఇరువైపులా వాదనల అనంతరం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. ఈ స్టేజ్‌లో క్వాష్‌ పిటిషన్‌ను అనుమతించలేమని తెలిపింది. దీంతో, తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని లాయర్‌ సుందరం  కోర్టుకు తెలిపారు. 

కేటీఆర్ క్వాష్ పిటిషన్  డిస్మిస్ కాలేదు
తమ లీగల్ ఒపీనియన్ ప్రకారం  కేసును విత్ డ్రా చేసుకున్నామని.. కేటీఆర్ క్వాష్ పిటిషన్  డిస్మిస్ కాలేదని కేటీఆర్ తరఫు అడ్వకేట్ మోహిత్ రావు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఏ కోర్టులోనైనా అప్పిల్ చేసుకునేందుకు మాకు అవకాశం ఉంది. ఫార్ములా ఈ కార్ కేసులో సుప్రీం కోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరిపింది. కేటీఆర్ క్యాష్ పిటిషన్‌పై ఆర్యమా సుందరం, సిద్ధార్థ దవేలు వాదనలు వినిపించారు. ఈ కేసులో సెక్షన్ 13.1A పీసీ యాక్ట్ వర్తించదని వాదనలు వినిపించాం. ఏసీబీ FIRలో పేర్కొన్న అంశాలు ప్రొసీజర్‌లో ఉన్న ఇరెగ్యులారిటీకి సంబంధించిన అంశాలు అని మోహిత్ రావు పేర్కొన్నారు.

నేడు కేటీఆర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement