Shilpa Chowdary: శిల్పా చౌదరికి బెయిల్‌.. చంచల్‌గూడ జైలు నుంచి విడుదల

Shilpa Chowdary Gets Bail, Released From Chanchalaguda Jail - Sakshi

సాక్షి, మణికొండ: సంపన్న మహిళలను కిట్టీ పార్టీలకు పిలిచి, అధిక వడ్డీలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అని వారిని నమ్మించి కోట్లు దండుకున్న శిల్పాచౌదరికి ఎట్టకేలకు రాజేంద్రనగర్‌ కోర్టు గురువారం బెయిలు మంజూరు చేసింది. ఆమెపై ఉన్న 3 కేసులలోను బెయిలు మంజూరవడంతో శుక్రవారం  విడుదలయ్యారు.  శిల్పాచౌదరికి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. 10వేల రూపాయల చొప్పున ష్యూర్టీలు సమర్పించాలని చెప్పింది. సమాచారం లేకుండా విదేశీ ప్రయాణం చేయొద్దని .. నిబంధన విధించింది. ఎవరితోనూ ఫోన్‌లో కానీ, డైరెక్ట్‌‍గా కానీ, కేసు విషయం మాట్లాడకూడదని సాక్షులను బెదిరించరాదని కోర్టు ఆదేశించింది. అలాగే ప్రతీ శనివారం నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌లో హాజరుకావాలని తెలిపింది.

కాగా గతనెల 13న ఆమెపై దివ్యారెడ్డి అనే మహిళ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయగా 25వ తేదీన శిల్పను అరెస్టు చేసి 26న రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం 3 సార్లు కస్టడీకి తీసుకుని విచారించినా మహిళల నుంచి తీసుకున్న డబ్బును ఏం చేసిందో మాత్రం నోరు విప్పలేదు. కొందరు మహిళలకు డబ్బు ఇచ్చానని, ఓ ఆసుపత్రి నిర్మాణంలో పెట్టుబడి పెట్టానని, హయత్‌నగర్‌లో ఓ ప్లాటు, గండిపేటలో ఓ విల్లా ఉందని వాటిని అమ్మి తనపై ఫిర్యాదులు చేసిన వారికి డబ్బు తిరిగి ఇచ్చేస్తానని విచారణల్లో పేర్కొంది.   
చదవండి: పోలీసుల విచారణ.. మౌనమే శిల్పా సమాధానం? 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top