అత్యంత అణగారిన వర్గాలుగా ఎస్సీ/ఎస్టీలు | SCs, STs most backward sections in Telangana | Sakshi
Sakshi News home page

అత్యంత అణగారిన వర్గాలుగా ఎస్సీ/ఎస్టీలు

Apr 17 2026 5:46 AM | Updated on Apr 17 2026 5:48 AM

SCs, STs most backward sections in Telangana

సంక్షేమ ప్రయోజనాలు ఏకరీతిన, న్యాయంగా పంపిణీ కాలేదు 

11 పథకాల (మొత్తం రూ.54,521 కోట్లకు పైగా)

ఆడిట్‌లో రాష్ట్ర సగటు కంటే తక్కువ వెనుకబడిన వర్గాలకు...

రైతుభరోసా, ఉచిత విద్యుత్‌ వంటివి అత్యంత అణగారిన వర్గాల కంటే

భూస్వామ్య, సాధారణ కులాలకు అసమాన ప్రయోజనం 

‘నమోదైన వెనుకబాటుతనం స్థాయి’ఆధారిత నమూనాకు

మారాలని నిపుణుల బృందం సూచనలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వివిధ సామాజిక వర్గాల వారీగా సంక్షేమ ప్రయోజనాలు అంతటా ఏకరీతిగా లేదా న్యాయంగా పంపిణీ కాలేదని, అత్యంత అట్టడుగు వర్గాలకు ఈ ప్రయోజనాలు చేరే విషయంలో గణనీయమైన వ్యత్యా సాలు ఉన్నాయని గుర్తించారు. సంక్షేమ నిధుల్లో సుమారు 30% తక్కువ వెనుకబడిన వర్గాలకు వెళుతుండగా, రైతు భరోసా, ఉచిత విద్యుత్‌ వంటి ప్రధాన పథకాలు మరింత వెనుకబడిన వర్గాల కంటే భూస్వామ్య, సాధారణ కుల వర్గాలకే తరచుగా అనుకూలంగా ఉంటున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం వంటి కొన్ని కార్యక్రమాలు అట్టడుగు వర్గా లను (ఉదా... 20% ఎస్సీ లబ్ధిదారులు) మెరుగ్గా లక్ష్యంగా చేసుకుంటుండగా, వ్యవసాయ రాయితీలు వంటి ఇతర కార్య క్రమాల్లో వారి వెనుకబాటుతనం స్థాయిలతో పోలిస్తే ఎస్సీల ప్రాతినిధ్యం తక్కువగా ఉంటోంది.

తాజాగా విడుదలైన సామాజిక–ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే 2024 లోని ఫలితాలు సూచిస్తున్నదేమిటంటే... సంక్షేమ ప్రయోజ నాలు ప్రస్తుతం సమానంగా పంపిణీ కాలేదు. వివిధ సామా జిక వర్గాల్లో వెనుకబాటుతనం యొక్క స్థాయికి సంబంధించి స్వతంత్ర నిపుణుల కార్యవర్గం (ఐఈడబ్ల్యూజీ) విశ్లేషించిన ఈ నివేదిక... సంక్షేమ వ్యయానికి– వాస్తవ లేమికి మధ్య గణ నీయమైన వ్యత్యాసాన్ని ఎత్తిచూపుతోంది. అత్యంత అట్టడు గు వర్గాలకు మెరుగైన మద్దతు అందించేందుకు, జనాభా ఆధారిత నమూనా నుంచి వెనుకబాటుతనం స్థాయికి అనుపాతంగా ఉండే నమూనాకు మారే ‘సామాజిక న్యాయం 2.0’ను ఐఈడబ్ల్యూజీ ప్రతిపాదిస్తోంది. ఒకే ఆదాయ స్థాయిల్లో కూడా, సాధారణ వర్గ కుటుంబాలతో పోలిస్తే నిమ్న కుల కుటుంబాలకు సామాజిక గుర్తింపు కారకాలు అధిక ప్రతికూలతను కలిగిస్తాయని నివేదిక పేర్కొంది.

సామాజిక వర్గ పోలిక...
ఈ సర్వే కాంపోజిట్‌ బ్యాక్‌వర్డ్‌నెస్‌ ఇండెక్స్‌ (సీబీఐ), రాష్ట్రాల సగటు 81తో పోల్చితే గణనీయమైన అసమా నతలను వెల్లడిస్తోంది. 
ఎస్సీ/ఎస్టీలు (జనాభాలో 17.4% – 10.4%) అత్యంత అణగారిన వర్గాలుగా ఉన్నారు. వీరిలో దాదాపు సభ్యులందరూ సగటు కంటే ఎక్కువ వెనుకబాటు తనాన్ని కనబరుస్తున్నారు.
బీసీలు (56.4% జనాభా) అధిక స్థాయి వంచనను (సగటు కంటే 71% ఎక్కువ) ప్రదర్శిస్తున్నారు.
సాధారణ కులాలు (జనాభాలో 11.9%) సగటు వెనుకబాటుతనం స్కోరు కంటే దిగువన ఉన్నాయి

సామాజిక న్యాయం 2.0...
కేవలం జనాభా వాటా ఆధారంగా ప్రయోజనాలను పంపిణీ చేసే విధానం నుంచి అత్యంత వెనుకబడినవిగా గుర్తించిన 135 కుల సమూహాలకు ప్రాధాన్యం ఇస్తూ...‘నమోదైన వెనుకబాటుతనం స్థాయి’ఆధారిత నమూనాకు మారాలని నిపుణుల కార్యవర్గం సిఫార్సు చేసింది.

సంక్షేమ పంపిణీపై కీలక ఫలితాలు
⇒  ప్రయోజనాల దుర్వినియోగం...11 ప్రధాన సంక్షేమ పథకాల (మొత్తం రూ.54,521 కోట్లకు పైగా) ఆడిట్‌లో రాష్ట్ర సగటు కంటే తక్కువ వెనుకబడిన వర్గాలకు ప్రస్తుతం 30% ప్రయోజనాలు అందుతున్నాయని వెల్లడైంది. ∙అసమాన వ్యవసాయ ప్రయోజనాలు... వ్యవసాయ అనుసంధాన పథకాలు (ఉదా.. రైతుభరోసా, ఉచిత విద్యుత్‌) అత్యంత అణగారిన వర్గాల కంటే, భూస్వామ్య వెనుకబడిన తరగతులు (బీసీ) సాధారణ కులాల వారికి అసమానంగా ప్రయోజనం చేకూరుస్తున్నాయి. 

⇒ ఎస్సీ/ఎస్టీల విస్మరణ... అభివృద్ధి సూచికల పరంగా సాధారణ వర్గం కంటే షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్టీలు) దాదాపు మూడు రెట్లు ఎక్కువ వెనుకబడినవారిగా గుర్తించినా, అన్ని ప్రధా న పథకాల్లో అత్యధిక లబ్ధి వారు పొందడం లేదు.
⇒  వైద్య రుణ అసమానత...అగ్రవర్ణ కుటుంబాలతో పోలిస్తే ఎస్సీ కుటుంబాలు వైద్య అత్యవసర పరిస్థితుల కోసం రుణాలు తీసుకునే అవకాశం దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని వైల్లడైంది.

⇒  దీనిని బట్టి అత్యంత ఆర్థిక దుర్బలత్వం ఉన్నవారికి ఆరోగ్య సంక్షేమ పథకాలు సమర్థవంతంగా చేరడం లేదని స్పష్టమవుతోంది.
⇒  ప్రభావవంతమైన లక్షిత పథకాలు...దీనికి విరుద్ధంగా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సామాజిక భద్రత పథకాలు మరింత లక్షితమైనవిగా గుర్తించారు. వీటి లబ్ధిదారులలో 20% మంది ఎస్సీ మహిళలున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement