ప్రముఖ విద్యావేత్త  గ్రేగరి రెడ్డి కన్నుమూత

Saint Anthony And Joseph School Founder Gregory Reddy Passed Away - Sakshi

1971లో సెయింట్‌ ఆంథోనీస్, 

1981లో సెయింట్‌ జోసెఫ్‌ స్కూళ్ల స్థాపన

హిమాయత్‌నగర్‌ (హైదరాబాద్‌): సెయింట్‌ ఆంథోనీస్, సెయింట్‌ జోసెఫ్‌ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, ప్రముఖ విద్యావేత్త ఉడుముల గ్రేగరి రెడ్డి(88) కన్నుమూశారు. అనారోగ్యానికి గురై కొంతకాలంగా చికిత్స పొందుతూ దోమలగూడలోని ఆయన నివాసంలో బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గ్రేగరి రెడ్డికి భార్య, 9 మంది పిల్లలు ఉన్నారు. భార్య ఇటీవలే చనిపోయారు. గ్రేగరి రెడ్డి 1971వ సంవత్సరంలో సెయింట్‌ ఆంథోనీస్‌ పేరుతో కింగ్‌కోఠిలో స్కూల్‌ను స్థాపించారు. ఆ తర్వాత పదేళ్లకు 1981లో ఇదే ప్రాంతంలో సెయింట్‌ జోసెఫ్‌ పబ్లిక్‌ స్కూల్‌ను ప్రారంభించారు. 2000వ సంవత్సరంలో హబ్సిగూడ, అస్మన్‌ఘట్‌ ప్రాంతాల్లో సెయిం ట్‌ జోసెఫ్‌ పేరుతో మరో రెండు స్కూల్స్‌ను ప్రారంభించారు.

ఐసీఎస్‌సీ బోర్డు మెంబర్‌గా గత నాలుగు దశాబ్దాలుగా విద్యారంగానికి సేవలందిస్తూ ఇంగ్లిష్‌ మీడియంలో సమూలమైన మార్పుల కోసం ఆయన కృషి చేశారు. గ్రేగరి రెడ్డి భౌతిక కాయాన్ని బంధువులు, స్నేహితుల సందర్శన కోసం గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కింగ్‌కోఠి సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్లో ఉంచనున్నారు. అనంతరం 3 గంటలకు నారాయణగూడ సిమెంట్రీలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top