
వ్యవసాయ వర్సిటీతో కలిసి 11 వేల గ్రామాలకు సరఫరా
40 వేల మంది అభ్యుదయ రైతులకు విత్తన కిట్లు పంపిణీ
ప్రతి గ్రామంలో ముగ్గురు, నలుగురు అభ్యుదయ రైతుల ఎంపిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 11 వేల గ్రామాల్లో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు నాణ్యమైన విత్త నాలు అందించే కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ప్రొఫె సర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యా లయంతో కలిసి చేపడుతోంది. ‘గ్రామ గ్రామానికి వ్య వసాయ విశ్వవిద్యాలయ నాణ్యమైన విత్తన పంపిణీ’ అనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం లాంఛనంగా ప్రారంభించను న్నారు. జిల్లాల్లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలలో భాగంగా ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు 5 ప్రధాన పంటలకు సంబంధించిన (వరి, కంది, పెసర, మిను ములు, జొన్న) నాణ్యమైన విత్తనాల కిట్లను పంపిణీ చేస్తా రు.
ఇప్ప టికే ఎంపిక చేసిన మిగతా అభ్యుదయ రైతు లకు జూన్ 3వ తేదీన ఆయా గ్రామలకు సంబంధించిన రైతు వేదికల నుంచి స్థానిక ఏఈఓ, ఏఓలు, వ్యవ సాయ విశ్వ విద్యాలయ నోడల్ అధికారుల పర్యవేక్షణ లో విత్తన కిట్లను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమం క్రింద సుమారు 40,000 మంది అభ్యుదయ రైతులకు నా ణ్యమైన విత్తన కిట్లను పంపిణీ చేయనున్నారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సుమారు 10,250 క్వింటాళ్ల విత్త నాన్ని సిద్ధంగా ఉంచినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. మే 5వ తేదీ నుంచి జూన్ 13 వరకు వ్యవసాయ వర్సిటీ, రాష్ట్ర వ్యవసా య శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘రైతు ముంగిట శాస్త్ర వేత్తలు’కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 800 గ్రామాలలో 48,000 మంది రైతులకు విత్తన ప్రా ము ఖ్యతపై అవగాహన కల్పించినట్లు వెల్లడించారు.
విత్తన స్వయం సమృద్ధే లక్ష్యం
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే విత్తన మార్పిడి రేటు (సీడ్ రీప్లేస్‌మెంట్ రేట్) 92 శాతంతో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. కొన్నేళ్లుగా విత్తన కంపనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి వివిధ పేర్లతో విత్త నాలను అధిక ధరలకు రైతులకు విక్రయిస్తు న్నాయి. అక్కడక్కడా నాణ్యత లోపించిన విత్తనాల ఫలితంగా దిగుబడులు తగ్గిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ప్రధాన పంటల నాణ్యమైన మూల విత్తనాన్ని ప్రతి గ్రామంలో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. దాదాపు 40,000 విత్తన కిట్లను గ్రామాలలో పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచారు. ఈ విత్తనంతో అభ్యుదయ రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో సాగుచేసి వచ్చే దిగుబడిని తిరిగి ఆయా గ్రామాలలోని రైతాంగానికి విత్తన రూపంలో సరఫరా చేయాలని ప్రభుత్వం సూచించింది.