ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్

సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సామాజిక విశ్లేషకుడు, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగనున్నారు. గతంలో 2007, 2009లలో ఎమ్మెల్సీగా ఆయన విజయం సాధించారు. 2014 వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు. ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల మద్దతుతో తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీ చేసే అంశంపై మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వెలువడుతున్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ స్పష్టత ఇచ్చారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి