ప్రగతిభవన్‌ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ యత్నం; ఉద్రిక్త పరిస్థితులు

Police Arrest JAC Leaders Attempt To Invade Pragatibhavan Job Notofication - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ చేయాలంటూ నిరుద్యోగ జేఏపీ మంగళవారం ప్రగతిభవన్‌ ముట్టడికి యత్నించింది. అయితే నిరుద్యోగులు తలపెట్టిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కొంతమంది జేఏసీ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేయాలంటూ డిమాండ్‌ చేశారు. 

ప్రగతి భవన్ వద్ద ఉన్న గేటు ఎక్కి ఆందోళనకారులు  కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. నిరుద్యోగుల ఆందోళనతో ప్రగతి భవన్ వద్ద ట్రాఫిక్ కు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు కేబినెట్ కూడ ఈ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top