విధులకు డుమ్మా కొట్టి.. విందులో చిందులు 

Panchayati Raj Department Officers Drink And Dance In Kondapaka - Sakshi

పంచాయతీరాజ్‌ శాఖ అధికారుల నిర్వాకం 

కొండపాక(గజ్వేల్‌): పనివేళల్లో విధులకు డుమ్మా కొట్టి విందులు, వినోదాల్లో మునిగితేలారు సిద్దిపేట జిల్లా పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు, సిబ్బంది. జిల్లాలోని 22 మండలాల పంచాయతీ రాజ్‌ శాఖ ఉద్యోగులు శుక్రవారం కొండపాక శివారులోని ఓ మామిడి తోటలో సమావేశమై విందులు చేసుకుంటూ చిందులు వేశారు.

ఈ వ్యవహారం కాస్తా టీవీ చానళ్లలో, సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి సీరియస్‌ అయ్యారు. కొండపాక ఎంపీడీఓ రాజేశ్‌ను కలెక్టర్‌ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశించారు. మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) నర్సింగరావును సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు.
చదవండి: Coronavirus: ‘ప్రైవేటు’లో టీకాల జోరు!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top