డీజీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ | Sakshi
Sakshi News home page

డీజీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ

Published Tue, Mar 21 2023 8:46 AM

Mla Raja Singh Letter To Dgp Anjani Kumar On Threatening Calls - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డీజీపీ అంజనీకుమార్‌కి గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ రాశారు. పలు ఫోన్‌ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయంటూ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని రాజాసింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, ఎమ్మెల్యే రాజాసింగ్‌ తనకు పాకిస్తాన్‌ నుంచి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్‌ వచ్చినట్లు ట్విట్టర్‌ ద్వారా రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వాట్సాప్‌ ద్వారా పాకిస్థాన్‌ నుంచి ఓ వ్యక్తి ఫోన్‌ చేసి తన ఆచూకీ, కుటుంబ వివరాలు చెబుతూ... హైదరాబాద్‌లో ఉన్న యాక్టివ్‌ స్లీపర్‌ సెల్‌ ద్వారా చంపేస్తామని బెదిరించినట్లు రాజాసింగ్‌ తెలిపారు. ప్లస్‌ 923105017464 నెంబర్‌ ద్వారా బెదిరింపు కాల్స్‌ వచ్చినట్లు రాజాసింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరచూ ఇలాంటి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
చదవండి: 11 గంటలు .. 14 ప్రశ్నలు.. కవిత సమాధానాలు పూర్తిగా వీడియో రికార్డింగ్‌ 

Advertisement
 
Advertisement