కరీంనగర్: కరీంనగర్ నడిబొడ్డున జ్యువెలరీ షాపులోదొంగతనం జరిగి, అక్కడ కాల్పుల ఘటన జరగడం దురదృష్టకరమన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి. కరీంనగర్‌లో తెలంగాణ భద్రతా ఉందా? లేదా అని ప్రశ్నించారు. ఈ మేరకు కరీంనగర్ సీపీపై విరుచుకుపడ్డారు కౌశిక్‌రెడ్డి. పదకొండు గంటలకు సంఘటన జరిగితే ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేదని, సీపీ ఏం చేస్తున్నారని మండిపడ్డారు.
‘కరీంనగర్‌లో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. పోలీస్ వ్యవస్థ డేంజర్ లో ఉంది. గాయపడ్డ నలుగురికి ఏమన్నా జరిగితే బాధ్యత ఎవరిది..,?, పదకొండు గంటలకు సంఘటన జరిగితే ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేదు. కరీంనగర్ సీపీ గడ్డి పీకుతుండా...?, వెపన్స్ పట్ఠుకుని కరీంనగర్‌లోకి ఎలా వచ్చారు..?, హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బండిసంజయ్ రాజీనామా చెయ్యాలి. సీపీని సస్పెండ్ చేయాలి’ అని డిమాండ్ చేశారు.


