పరిచయం ఉన్న యువతి ఆఫీస్‌కు వెళ్లి.. బలవంతంగా..

Man Arrested For Harassing Woman At Her Office In Hyderabad - Sakshi

సాక్షి, చిక్కడపల్లి: యువతిని వేధించిన కేసులో చిక్కడపల్లి పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.సంజయ్‌కుమార్‌ వివరాల మేరకు.. సంగారెడ్డికి చెందిన టి.శ్రీకాంత్‌(27) తనకు పరిచయం ఉన్న యువతి పనిచేసే కార్యాలయానికి వెళ్లాడు. ఆమెను బలవంతంగా తన వాహనంపై ఎక్కించుకుకే ప్రయత్నం చేయడంతో చిన్నపాటి గొడవ జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు శ్రీకాంత్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సోమవారం యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 
చదవండి: పాపం పసివాడు.. కుమారుడితో సహా భవనంపై నుంచి దూకిన మహిళ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top