
హైదరాబాద్: ఖైరతాబాద్ మహా వినాయకుడి దర్శనానికి గురువారం అర్ధరాత్రి వరకే అనుమతి ఉంటుందని, ఆ తర్వాత భక్తుల దర్శనాలను నిలిపివేస్తామని నిర్వాహకులు తెలిపారు. శనివారం మహా వినాయకుడి నిమజ్జనం సందర్భంగా షెడ్డు తొలగింపు పనులు, క్రేన్ ఏర్పాట్ల కారణంగా శీఘ్ర, సర్వదర్శనాలకు అవకాశం ఉండదు. భక్తులు ఈ విషయాన్ని గమనించి నిర్వాహకులకు, పోలీసులకు సహకరించాలని కోరారు.
1.04 లక్షల విగ్రహాల నిమజ్జనం
సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలోని ఆరు జోన్ల పరిధిలో మంగళవారం వరకు 1,04,135 విగ్రహాల నిమజ్జనం జరిగినట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది. ఆయా ప్రాంతాల్లోని పెద్ద చెరువులతోపాటు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొలనుల్లో ఈ నిమజ్జనాలు జరిగాయి. వీటిలో చిన్న, పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి.