‘ఇది అంతరాష్ట్ర దొంగల ముఠా పనే’ | IG Chandrasekhar Reddy Reviews Jewelry Shop Theft Case In Karimnagar, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

‘ఇది అంతరాష్ట్ర దొంగల ముఠా పనే’

May 3 2026 5:11 PM | Updated on May 3 2026 5:55 PM

IG Chandrasekhar Reddy Reviews Jewelry Shop Theft Case In Karimnagar

కరీంనగర్: కరీంనగర్‌ పీఎంజే జ్యువెలరీ షాప్‌లో దొంగతనానికి పాల్పడింది అంతరాష్ట్ర దొంగల ముఠానే అని తెలిపారు మల్టీజోన్‌ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి. దొంగలు ఎవరూ మాస్కులు పెట్టుకోలేదని, వారి ముఖాలను ఐడెంటీఫై చేశామన్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందన్నారు. దొంగల్లో ఒక అతను తెలుగులో మాట్లాడితే, మరొకరు హిందీలో మాట్లాడారన్నారు. ఈ తరహా ఘటన తాజాగా చందానగర్‌లోనూ జరిగిందన్నారు ఐజీ.

కరీంనగర్‌ పీఎంజే జ్యువెలరీ షాప్‌లో దోపిడీ కేసుకు సంబంధించి సిసిటీవీ ఫుటేజ్ క్లూస్ టీమ్స్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం. కిలో వరకు బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు సిబ్బంది చెప్తున్నారు. ఎంత జ్యువెలరీ పోయింది అనేది లెక్కలు తేలిన తర్వాత చెప్తాం. దొంగలు వాహనాలు మార్చుతూ పారిపోతున్నారు.’ అని ఆయన పేర్కొన్నారు. దొంగల కోసం 12 దర్యాప్తు బృందాలతో గాలిస్తున్నామన్నారు. ఐదుగురు నిందితులు దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. నార్త్‌ ఇండియాకు చెందని గ్యాంగ్‌గా అనుమానిస్తున్నామన్నారు. 

ఇదీ చదవండి: 

కరీంనగర్‌ పీఎంజే జ్యువెలరీలో కాల్పులు

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement