కరీంనగర్‌ పీఎంజే జ్యువెలరీలో కాల్పులు | Shots Fired At PMJ Jewellery In Karimnagar During Armed Daylight Robbery, Gold Looted And Staff Injured | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ పీఎంజే జ్యువెలరీలో కాల్పులు

May 3 2026 11:47 AM | Updated on May 3 2026 12:41 PM

Shots Fired At Pmj Jewellery In Karimnagar

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌లో పట్టపగలే కాల్పుల కలకలం రేగింది. దొంగల ముఠా రెచ్చిపోయారు. జ్యోతినగర్‌లోని పీఎంజే జ్యువెలరీ షాపులో తుపాకులతో ఐదుగురు దొంగలు చొరబడ్డారు. షాపులోని సిబ్బందిపై కాల్పులు జరిపిన దొంగలు.. భారీగా బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. గాయపడిన నలుగురి సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. దొంగలు షాపులో 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఉదయం 10 గంటలకు షాపును  సిబ్బంది  ఓపెన్‌ చేశారు. లాకర్‌లో ఉన్న బంగారు అభరణాలను డిస్‌ప్లే పెడుతుండగా దొంగలు ప్రవేశించారు. లోపలికి వస్తూనే సిబ్బందిపై కాల్పులు జరిపారు జ్యువెలరీలో సుమారు 20 నిమిషాల పాటు పెనుగులాట జరిగింది. రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement