Weather Forecast: Rain Hits Some Areas in Hyderabad - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం.. మరోవైపు చలి పులి

Jan 6 2023 6:49 AM | Updated on Jan 6 2023 9:20 AM

Hyderabad Weather Forecast: Rain Hits Some Area Jan 2023 - Sakshi

అన్‌సీజన్‌లో హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం కురిసింది.. 

సాక్షి, హైదరాబాద్‌:  అన్‌సీజన్‌లో నగరాన్ని వరుణుడు పలకరించాడు. గురువారం అర్ధరాత్రి తర్వాత నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరు జల్లులు కురియగా, శుక్రవారం వేకువఝామునే మరోసారి చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు దాకా వర్షం కురిసింది. 

బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, చింతల్‌, బాలానగర్‌, సుచిత్ర, కుత్బుల్లాపూర్‌, బేగంపేట.. ఇంకా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్నిచోట్ల చిరు జల్లులు కురియగా, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం గట్టిగానే దంచికొట్టింది.

ఒకవైపు గత రెండు మూడు రోజులుగా నగరంలో చలి విజృంభణతో నగరవాసులు వణికిపోతుండగా, ఇప్పుడు వర్ష ప్రభావంతో చలి తీవ్రత మరింత పెరగొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement