2.54 కోట్ల మందికి ప్రభుత్వ పథకాల లబ్ధి | Government Scheme Benefits Extended to 2.54 Crore People: Telangana | Sakshi
Sakshi News home page

2.54 కోట్ల మందికి ప్రభుత్వ పథకాల లబ్ధి

Apr 17 2026 5:58 AM | Updated on Apr 17 2026 5:58 AM

Government Scheme Benefits Extended to 2.54 Crore People: Telangana

అందులో పేద, మధ్య తరగతి వర్గాలకు 71 శాతం.. 29 శాతం ధనిక వర్గాలకు 

ఎస్‌ఈఈఈపీసీ సర్వేలో వెల్లడైన సంక్షేమ పథకాల అమలు తీరు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో 71 శాతం వెనుకబడిన 135 కులాలకు అందుతున్నాయని ఎస్‌ఈఈఈపీసీ–2024 సర్వేలో వెల్లడైంది. అభివృద్ధి చెందిన వర్గాలకు సైతం దాదాపు 29 శాతం లబ్ధి చేరుతున్నట్టు స్పష్టమైంది. సర్వే గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ప్రధాన సంక్షేమ పథకాల ద్వారా మొత్తం 2.54 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. ఈ పథకాలపై ప్రభుత్వం 2024లో రూ.1.03 లక్ష కోట్లకు పైగా ఖర్చు చేయగా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, రైతుభరోసా, పింఛన్లు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రధానంగా అమలవుతున్నాయి. 

బీసీలే అధికం
సర్వే ప్రకారం అత్యంత వెనుకబడిన 135 కులాలకు చెందిన 1.80 కోట్ల మంది లబ్ధి పొందగా, ఇది మొత్తం లబ్ధిలో 71 శాతం. మిగతా 29 శాతం లబ్ధి తక్కువ వెనుకబడిన వర్గాలకు చేరుతోంది. సామాజిక వర్గాల వారీగా చూస్తే బీసీలు అన్ని పథకాల్లో ప్రధాన లబ్ధిదారులుగా నిలుస్తున్నారు. 

ఓసీలు ప్రధానంగా వ్యవసాయ సంబంధిత పథకాలలో అధిక ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు.
రైతుభరోసాలో ఎస్‌సీల వాటా కేవలం 14 శాతం మాత్రమే ఉండగా, ఉచిత విద్యుత్‌లో 12 శాతం మాత్రమే ఉంది.
పింఛన్లు, ఆరోగ్యశ్రీ, బస్సు ప్రయాణం వంటి సామాజిక పథకాల్లో మాత్రం ఎస్‌సీ, ఎస్టీలకు జనాభా వాటా కంటే ఎక్కువ లబ్ధి చేకూరుతోంది. తర్వాత స్థానంలో బీసీలు కూడా అధిక మొత్తంలోనే లబ్ధిదారులుగా ఉన్నారు. 

ఆయా వర్గాలు లబ్ధి పొందిన ప్రభుత్వ పథకాలు 
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం    1.01 కోట్లు (58%)
గృహజ్యోతి            42.9 లక్షలు (38%)
రైతుభరోసా         30.6 లక్షలు (27%)
పింఛన్లు             23.2 లక్షలు (21%)

బీసీలు – అత్యధిక లబ్ధిదారులు
మొత్తం పథకాలలో సగటున 58% నుంచి 60% వరకు లబ్ధి
చేయూత పింఛన్‌లో        : 62%
గృహ జ్యోతి            : 60%
బస్సు ప్రయాణం, ఎల్‌పీజీ, ఇతర పథకాలలో కూడా అధిక వాటా 

ఎస్సీలు– రెండో స్థానంలో
హౌసింగ్‌: 25%        ఆరోగ్యశ్రీ: 21%
ఇతర సామాజిక పథకాలలో మంచి ప్రాతినిధ్యం

ఎస్టీలు– మూడో స్థానంలో
ఎస్‌టీలు – 10.9% జనాభా
వ్యవసాయ, గృహ పథకాలలో అధిక లబ్ధి రైతుభరోసా, విద్యుత్, బీమా వంటి పథకాలలో ముందంజ

ఓసీలు: 12.4%
అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా లబ్ధి చేకూరుతున్నట్లు సర్వే తేల్చింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement