కిడ్నాప్‌ కథ సుఖాంతం.. గౌతమ్‌ సేఫ్‌

Five Year Boy Kidnapped At Suryapet Police Rescue The Child - Sakshi

సాక్షి, సూర్యాపేట: దీపావళి టపాసుల కోసం వెళ్లి కిడ్నాప్‌నకు గురైన బాలుడు గౌతమ్ (5) క్షేమంగా ఇల్లు చేరాడు. సూర్యాపేటలో గౌతమ్‌ను గుర్తించిన పోలీసులు బాలుడిని తండ్రికి అప్పగించారు. జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్‌ నగర్‌కు చెందిన పరికపల్లి నగేష్‌, నాగలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు గౌతమ్‌. ఇంటి సమీపంలోనే ఉన్న కిరాణా దుకాణంలో టపాసులు కొనేందుకు బాలుడు నిన్న రాత్రి 7:30కి సైకిల్‌పైన వెళ్లాడు. టపాసులు కొనుగోలు చేసిన తర్వాత ఎంత సేపటికీ ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల గాలించిన అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 24 గంటలపాటు పోలీసులు ముమ్మర తనిఖీలు చేయడంతో బాలుడి కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
(చదవండి: బాలుడి అదృశ్యం కలకలం)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top