
ఆడపిల్లకు ప్రోత్సాహకాలు
నల్గొండ: దేవరకొండ మండలం మైనంపల్లికి చెందిన కొర్ర రాంసింగ్ – గౌతమి దంపతులు ఆడబిడ్డలంటే ఎంతో మమకారం. దేవరకొండ నియోజకవర్గ పరిధిలో గతంలో ఆడశిశువు జన్మిస్తే భారంగా భావించిన కొన్ని గిరిజన కుటుంబాల పరిస్థితిని కళ్లారా చూశారు. ఆడపిల్లను భారంగా భావించొద్దని.. ఆడపిల్లను ఇంటికి మహాలక్ష్మిలా భావించాలని ఎందరికో అవగాహన కల్పించారు.
చివరికి ఆడపిల్ల పుట్టినా, ఆడపిల్ల వివాహం చేసినా ఆర్థిక సాయం చేయాలని తలిచి గ్రామంలో రామన్న కల్యాణ కానుక పథకానికి శ్రీకారం చుట్టారు. అనుకున్నదే తడవుగా 2020లో ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. మైనంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మొదట్లో రూ.1,016తో ప్రారంభించిన రామన్న కల్యాణ కానుకను మరుసటి సంవత్సరం నుంచి రూ.2,016 పెంచారు. ఐదేళ్ల నుంచి గ్రామంలో ఆడబిడ్డల వివాహానికి రూ.2,016, ఆడపిల్ల జన్మిస్తే వారి కుటుంబానికి రూ.2,016 అందిస్తున్నారు. దీంతో ఆ దంపతులను పలువురు అభినందిస్తున్నారు.