
సాక్షి, యాదాద్రి భువనగిరి : మోటకొండూరు మండల కేంద్రంలో నర్సయ్య అనే రైతు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ధర్నా చేపట్టాడు. తన పొలంలో వేసిన పంటను ధ్వంసం చేసిన నిందితులను అరెస్టు చేయాలని, తన భూమిని ఆక్రమ క్రమంగా కాజేయాలని ప్రయత్నం చేస్తున్న వారిపై, వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో. తనకు చావే శరణ్యమని అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైర్ కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన స్థానికులు రైతును అడ్డుకున్నారు.