
వారం రోజుల్లో 1704 మద్యం బాటిళ్లు స్వాదీనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ముఠాలపై ఎక్సైజ్ శాఖ దాడులు ముమ్మురం చేసింది. దసరా పండుగ సందర్భంగా కొందరు.. ఇతర రాఫ్ట్రాల నుంచి తక్కువ ధరకు మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి విమానాలు, రైళ్లు, బస్సులు, ఇతరవాహనాల్లో తెలంగాణకు రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నట్టు అందిన సమాచారం మేరకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ షాన్ వాజ్ ఖాసీం ఈ నెల 15 నుంచి 30 వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్టు ఎక్సైజ్‌శాఖ కమిషనర్ కార్యాలయం తెలిపింది.
ఎన్‌డీపీఎల్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఎస్టీఎఫ్ (స్టేట్ టాస్క్ ఫోర్స్), డీటీఎఫ్ (డ్రిస్టిక్ టాస్క్ ఫోర్స్), ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లు, ఎక్సైజ్ టీమ్‌లు వారం రోజులుగా నిర్వహించిన దాడుల్లో 1704 మద్యం బాటిళ్లను స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.68.16 లక్షలని అధికారులు తెలిపారు. కాగా, అక్రమ మద్యం రవాణా, సారా నియంత్రణపై సిబ్బంది మరింత దృష్టి పెట్టాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ షాన్‌వాజ్ ఖాసీం ఆదేశించారు.