ఆపాల్సిందే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ ఫైర్‌ | Ex Minister KTR Fires On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

ఆపాల్సిందే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ ఫైర్‌

Published Thu, Jun 20 2024 5:28 PM | Last Updated on Thu, Jun 20 2024 6:09 PM

Ex Minister KTR Fires On CM Revanth Reddy

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బొగ్గు గనుల వేలంలో తెలంగాణ పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సింగరేణిని ప్రైవేట్‌ పరం చేయాలని చూస్తున్నారని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసి బొగ్గు బ్లాక్‌లు వేలం వేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు వెంటనే వేలాన్ని ఆపాలి’’ అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

బొగ్గు గనులు వేలం పాడితే కూడా తెలంగాణ నష్టపోతుంది. రేవంత్‌ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ఖతం చేసినట్టే తెలంగాణ బొగ్గు గనులు కూడా అదే రీతిలో కాబోతుంది. కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న నాటకాలు ఇప్పుడు బయట పడుతున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రయత్నాలు సాగనివ్వలేదు. కానీ ఇప్పుడు బొగ్గు గనులు అగమయ్యే పరిస్థితికి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టిని డిమాండ్ చేస్తున్నా.. ఈ ప్రయత్నాన్ని ఆపండి. కేసులకు భయపడి రేవంత్ రెడ్డి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారా?’’ అంటూ కేటీఆర్‌ నిలదీశారు.

 

 

 

 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement