నేలంతా పూలాయె.. అంబరాన్ని అంటిన ఎంగిలి పూల బతుకమ్మ సంబురం

రంగురంగుల పూలతో.. అందంగా పేర్చిన బతుకమ్మలతో నేలంతా పూలవనాన్ని తలపించింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆదివారం వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇళ్ల వద్ద బతుకమ్మలకు పూజలు చేసి.. సాయంత్రం ఆలయాల వద్ద ఆడిపాడి సందడి చేశారు. అనంతరం ఘనంగా నిమజ్జనం చేశారు.