
సాక్షి, హైదరాబాద్: ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని కొత్త డీజీపీ అంజనీకుమార్ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌అలీని ఆయన అధికార నివాసంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సైతం హోం మంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న జితేందర్, ఏసీబీ నూతన డీజీపీ రవిగుప్తా సైతం మహమూద్‌అలీని ఆయన నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.