నేనేం పాపం చేశానమ్మా..  | Sakshi
Sakshi News home page

నేనేం పాపం చేశానమ్మా.. 

Published Sun, Aug 6 2023 2:37 AM

Dead body of a baby girl in the bushes - Sakshi

భువనగిరి: నవజాత శిశువును ఓ తల్లి కనకరం లేకుండా వదిలేసింది. చెట్ల పొదల్లో విసిరేసిన ఆ శిశువును కుక్కలు పీక్కుతింటూ బయటకు తీసుకురావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. యాదాద్రి జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది.

భువనగిరి పట్టణంలోని పాత శిల్పా హోటల్‌ వెనుక భాగంలో బాబూ జగ్జీవన్‌రామ్‌ భవనం ఉంది. అక్కడ ఓ పార్టీకి చెందిన నాయకులు శనివారం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. భవనం సమీపంలోనే సమాధులు, చెట్ల పొదలు ఉన్నాయి. సమావేశం నుంచి బయటికి వచ్చి న ఓ మహిళ చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన శిశువును కుక్కలు  బయటకు లాక్కురావడాన్ని గమనించింది.

ఈ విషయాన్ని ఆమె తోటి నాయకులకు చెప్పగానే వారు అక్కడికి వచ్చి కుక్కలను తరిమికొట్టారు. అప్పటికే ఆ ఆడశిశువు మృతిచెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఐసీడీఎస్‌ సిబ్బంది సహాయంతో పోస్టుమార్టం నిమిత్తం శిశువు మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.

 
Advertisement
 
Advertisement